Header Banner

అమరావతిలో ప్రధాని పర్యటనకు వేగంగా ఏర్పాట్లు.. 11 ప్రాంతాలను సిద్ధం..

  Thu Apr 24, 2025 13:20        Politics

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఇక్కడ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్రువీకరించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభా వేదిక ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రధాని పర్యటన కేవలం గంటన్నర మాత్రమే ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.. ఆ ప్రదేశాల్లో 'డ్రోన్' నిఘా!

 

ప్రధాని కాన్వాయ్ సాఫీగా సాగేందుకు 8 మార్గాలను గుర్తించామని, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 11 ప్రాంతాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. గత ఐదేళ్లలో ఇబ్బందులు పడిన అమరావతి రైతులలో కొందరిని (కనీసం ముగ్గురు, నలుగురిని) ప్రధాని సమక్షంలో సన్మానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నామని, ప్రజల అంగీకారంతోనే పూలింగ్ ఉంటుందని, లేనిపక్షంలో భూసేకరణ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన అన్నారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations